ఆ రోజుల్లో ఎలాంటి పువ్వులతో దేవుళ్లను ప్రార్థించాలి..?

సోమవారం, 18 మార్చి 2019 (12:21 IST)
కొందరైతే ప్రతిరోజూ దేవునికి పూజలు చేస్తుంటారు. కానీ, వారికి ఏరోజు ఎలాంటి పువ్వులు పూజకు ఉపయోగించాలో తెలియదు. భగవంతుని పూజలు చేయడం ఎంత ముఖ్యమో అదే విధంగా నైవేద్యాలు సమర్పించడం కూడా అంతే ముఖ్యమంటున్నారు పండితులు. కనుక.. ప్రతిరోజూ దేవునికి చేసే పూజలో నైవేద్యాలు తప్పకుండా సమర్పించండి.. ఫలితం ఉంటుంది.
 
1. ఆదివారం నాడు సూర్యుడిని ఎర్రని పుష్పాలతో పూజించాలి. 
 
2. సోమవారం నాడు శివుడిని మారేడు దళాలతో, తెల్ల పువ్వులతో పూజించాలి. 
 
3. మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని తమలపాకులతో, సుబ్రమణ్య స్వామిని ఎర్ర పువ్వులతో పూజించాలి. 
 
4. బుధవారం అయ్యప్ప స్వామిని ఆకుపచ్చ పుష్పాలతో పత్రితో పూజించాలి . గురవారం నాడు శ్రీ రాముడిని, లక్ష్మీ నరసింహ స్వామిని పసుపు రంగు పుష్పాలతో పూజించాలి. 
 
5. శుక్రవారం నాడు దుర్గా దేవిని ఎర్రమందార పువ్వులతో పూజించాలి. 
 
6. శనివారం నాడు వేంకటేశ్వర స్వామిని, నవగ్రహలను నీలం రంగు పువ్వులతో పూజించుట శ్రేష్టం. ప్రతీ వ్యక్తి 7 రోజులలో ఏదో ఒక రోజుని నియమంగా వారాలు చేయుట గ్రహదోషాలు తొలగిపోతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు