సంప్రదింపులు ఫలిస్తాయి. తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ఖర్చులు విపరీతం. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు. దంపతుల మధ్య అకారణ కలహం. ఆత్మీయులతో సంభాషిస్తారు.
శుభవార్త వింటారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు జాగ్రత్త. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాదాలు సద్దుమణుగుతాయి. ఓర్పుతో శ్రమించిన గాని పనులు కావు.
కష్టించినా ఫలితం ఉండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. సన్నిహితులు సాయం అందిస్తారు. మీ శ్రీమతి ధోరణిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సమయస్ఫూర్తితో మెలుగుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు సామాన్యం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సంతానం యత్నం ఫలిస్తుంది. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తవుతాయి. పొగిడేవారితో జాగ్రత్త. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. పెట్టుబడులపై దృష్టిపెడతారు.
ఆర్థిక లావాదేవీలు కొలిక్కివస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. మీ జోక్యం అనివార్యం. ఆప్తులతో సంభాషిస్తారు. కీలక సమావేశంలో పాల్గొంటారు.
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సన్నిహితులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. ఖర్చులు అధికం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. సంతానం విద్యాయత్నాం ఫలిస్తుంది. ధార్మిక విషయాలపై దృష్టిసారిస్తారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
దుబారా ఖర్చులు విపరీతం. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో వ్యవహరించండి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. నోటీసులు అందుకుంటారు. న్యాయనిపుణులను సంప్రదిస్తారు.
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. అపజయాలకు కుంగిపోవద్దు. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. రాబడిపై దృష్టి పెడతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆత్మీయుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
ధనలాభం, ప్రశాంతత ఉన్నాయి. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. సంప్రదింపులకు అనుకూలం. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ముఖ్యుల కలయిక సాధ్యపడదు, ధైర్యంగా ముందుకు సాగుతారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి.
మీ కష్టం వృధా కాదు. రావలసిన ధనం అందుతుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ప్రతి విషయాన్నీ నిశితంగా గమనించండి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. ఏకాగ్రతతో వాహనం నడపండి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసాధనకు సంకల్పబలం ప్రధానం. ధైర్యంగా యత్నాలు సాగించండి. ఖర్చులు సామాన్యం. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి.