భవిష్యత్ భరోసా కోసం హాలీవుడ్ కళాకారుల సమ్మెబాట

శుక్రవారం, 14 జులై 2023 (11:53 IST)
భవిష్యత్‌కు భరోసా కల్పించాలని కోరుతూ హాలీవుడ్ సినీ కళాకారులు, ప్రముఖులు సమ్మెబాటకు దిగారు. ఈ సమ్మె సైరన్ ఇపుడు కలకలం రేపింది. ఇందులో సుమారు 1.6 లక్షల మంది సినీ కళాకారులు సభ్యులుగా ఉన్న స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ నేతృత్వంలో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. 
 
భారత కాలమానం ప్రకారం గురువారం అర్థరాత్రి సమ్మె ప్రారంభమైంది. 1960 తర్వా హాలీవుడ్‌లో ఈ స్థాయి సమ్మె జరగడం ఇదే తొలిసారి.
ఓటీటీ రాకతో నానాటికీ తగ్గిపోతున్న పారితోషికాలు, ముంచుకొస్తున్న కృత్రిమ మేధ ఉపద్రవం నుంచి తమని తాము రక్షించుకునేందుకు సమ్మె బాట పట్టినట్టు స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ పేర్కొంది. 
 
స్టూడియోలు, ఓటీటీ వేదికలతో తాము జరిపిన చర్చలు విఫలమయ్యాయని యూనియన్ తరపున చర్చల్లో పాల్గొన్న డంకన్ క్యాబ్రీ ఐర్లాండ్ మీడియాకు తెలిపారు. గత 12 వారాలుగా అక్కడి సినీ రచయితలు పిక్కెట్ లైన్స్‌లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి తోడుగా నటీనటులు కూడా తాజాగా రంగంలోకి దిగడంతో ఇపుడు హాలీవుడ్ చిత్ర పరిశ్రమ స్తంభించిపోయింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు