‘ది అవెంజర్స్-ఎండ్ గేమ్’ విడుదల కోసం అవెంజర్స్ ఫ్యాన్స్ అంతా ఎంత ఆసక్తిగా, ఆతృతగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీరందరి ఆసక్తి వందింతలు కానుంది. ఎందుకంటే.. ‘ది అవెంజర్స్-ఎండ్ గేమ్’ కోసం సంగీత సంచలనం ఏ.ఆర్.రెహమాన్ ఒక పాటను స్వరపరుస్తున్నారు. ఈ పాటను ‘ది అవెంజర్స్-ఎండ్ గేమ్’ తెలుగు, తమిళ, హిందీ వెర్షన్స్‌లో పొందుపరుస్తున్నారు. ఇది అవెంజర్స్ ఫ్యాన్స్ అందరికీ గర్వకారణం.