లేడి గగా దీర్ఘకాలిక నొప్పితో బాధపడుతుందట.. డాక్టర్లు ఆమెతో చుట్టూ ఉంటారట..
ఆదివారం, 20 నవంబరు 2016 (13:22 IST)
ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంటూ మైకందుకుని ఉర్రూతలూరించేలా గీతాలు ఆలపించే ప్రముఖ పాప్ స్టార్ లేడి గగా(30) వ్యక్తిగత విషయాలు వెల్లడించింది. తొలిసారి దానికి సంబంధించిన తన వ్యక్తిగత రహస్యాన్ని చెప్పింది.
తాను గత కొంతకాలంగా ఓ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని గగా తెలిపింది. తాను గత కొంతకాలంగా క్రానిక్ పెయిన్ (దీర్ఘకాలిక నొప్పి)తో బాధపడుతున్నానని తెలిపింది.
తన ఈ ఆరోగ్యపరమైన అంశాన్ని సామాజిక అనుసంధాన వేదిక ఇన్‌స్టాగ్రమ్ ద్వారా పంచుకుంది. ''ప్రతి రోజు నొప్పులతో బాధపడుతున్నాను. అయితే, అనుభవజ్ఞులైన మహిళా వైద్యులు నా చుట్టే ఉండటం వల్ల చాలా సంతోషంగా భావిస్తున్నాను..'' అంటూ గగా తెలిపింది.