ఘర్షణపడిన తండ్రీకుమారులు.. ఆపేందుకు వెళ్లిన ఎస్ఎస్ఐ నరికివేత

ఠాగూర్

బుధవారం, 6 ఆగస్టు 2025 (13:17 IST)
తమిళనాడు రాష్ట్రంలోని తిరుపూర్ జిల్లాలో దారుణం జరిగింది. తండ్రీ కుమారులు ఘర్షణ పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆ గొడవను ఆపేందుకు వెళ్లారు. ఆ తర్వాత అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. గొడపపడటం ఆపేసిన తండ్రీతనయులు... ఎస్ఐను కొడవలితో ప్రాణాలు పోయేంతవరకు నరికేశారు. ఈ దారుణం జిల్లాలోని ఉడుమలైపేట సమీపంలోని కుడిమంగళం గ్రామంలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న ఎస్ఎస్ఐ షణ్ముగమవేల్‌కు ఒక అత్యవసర ఫోన్ కాల్ వచ్చింది. దీంతో వెంటనే ఆయన ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక అన్నాడీఎంకే ఎమ్మెల్యేకు చెందిన ఒక ప్రైవేట్ ఎస్టేట్‌లో పనిచేసే మూర్తి, ఆయన ఇద్దరు కుమారులైన తంగపాండియన్, మణికంఠన్‌లు గొడపడుతున్నారు. కొడుకులిద్దరూ కలిసి తండ్రిపై దాడి చేస్తుండటంతో ఎస్ఎస్ఐ కల్పించుకుని అడ్డుతీశాడు. కొడుకుల దాడిలో తీవ్రంగా గాయపడిన తండ్రిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ క్రమంలో పెద్ద కుమారుడు తంగపాండియన్‌తో షణ్ముగవేల్ మాట్లాడుతుండగా వెనుక నుంచి చిన్న కుమారుడు మణికంఠన్ వేట కొడవలితో ఎస్ఎస్ఐ దాడి చేసి నరికి చంపేశాడు. షణ్ముగవేల్ కారు డ్రైవర్ మాత్రం వారి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఈ ఘటనలో తండ్రి ఇద్దరు కుమారులు పరారీలో ఉన్నారు. వారి కోసం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ఆదేశించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు