గ్లోబల్‌స్టార్ ప్రియాంక చోప్రాకు అమెరికాలో చుక్కెదురైంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అంటే భయం లేదని.. తాను భారతీయురాలని ప్రియాంక చోప్రా వ్యాఖ్యానించింది. ఇంకా వీసా రద్దుపై కూడా ప్రియాంక చోప్రా నోరెత్తింది. అది సరికాదని తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో ప్రియాంక చోప్రా నటిస్తున్న అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికో నిలిచిపోతోందా? అవుననే అంటున్నాయి హాలీవుడ్ వర్గాలు.
ప్రస్తుతం ప్రియాంక క్వాంటికో రెండో సీజన్‌లో నటిస్తోంది. అయితే మొదటి సీజన్‌కి వచ్చినంత వ్యూయర్‌షిప్ రెండో సీజన్‌కి రావడంలేదట. ఈ విషయాన్ని ఇంతకుముందు క్వాంటికో ప్రసారమయ్యే ఏబీసీ చానెల్ కూడా తెలిపింది. అప్పట్లో వ్యూయర్‌షిప్‌మరీ 0.76కి పడిపోయినందుకు ఆదివారం ప్రసారమయ్యే షోని సోమవారానికి మార్చినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపింది. కానీ ఇప్పుడు ఈ మార్పు కూడా కలిసిరాలేదు.
ఇక రెండో సీజన్ వ్యూయర్‌షిప్ ఇంతకంటే పుంజుకునే అవకాశాలు కన్పించకపోవడంతో షోని నిలిపివేయాలని నిర్మాణ బృందం నిర్ణయించుకుందట. దీంతో ప్రియాంక చోప్రా తలపై చేయిపెట్టేసుకుందట. ఇప్పుడిప్పుడే హాలీవుడ్‌లో పుంజుకుంటున్న తనకు క్వాంటికో ప్రసారం ఆగిపోవడం గట్టి దెబ్బేనని బాధపడుతోందట. అయితే ఈ సీరియల్ ఆగిపోవడానికి-టీవీ రేటింగ్ పడిపోవడానికి ట్రంప్‌పై ప్రియాంక చోప్రా వ్యాఖ్యానించడానికి మధ్య లింకుండి వుంటుందని సినీ పండితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.