Japan Tsunami సోమవారం సాయంత్రం జపాన్‌లోని నైరుతి ప్రాంతంలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల ఆ ప్రాంతంలో రెండు చిన్న సునామీలు సంభవించినట్లు తెలిసింది కానీ ఎటువంటి నష్టం జరగలేదు. జపాన్ దేశంలోని క్యుషి ప్రాంతంలోని మియాజాకి ప్రిఫెక్చర్ తీరానికి 18 కిలోమీటర్ల దూరంలో 36 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
ఒక మీటర్ వరకు సునామీ తరంగాలు వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరించింది. తీరప్రాంత జలాలకు దూరంగా ఉండాలని ప్రజలను కోరింది. సునామీ పదే పదే రావచ్చనీ, సముద్రంలోకి ప్రవేశించవద్దనీ, తీర ప్రాంతాలకు దగ్గరగా వెళ్లవద్దని కోరింది. ఈ ప్రాంతంలోని రెండు ఓడరేవులలో దాదాపు 20 సెంటీమీటర్ల ఎత్తులో రెండు చిన్న సునామీలు గుర్తించబడినట్లు వాతావరణ సంస్థ తెలిపింది.