పరోటా. రాత్రివేళల్లో కొంతమంది ఈ పరోటాలను తినేందుకు ఇష్టపడుతుంటారు. ఇందులో కుర్మా, చికెన్ కర్రీ వేసుకుని తినేస్తుంటారు. ఐతే మైదాతో చేసే ఈ పరోటాలో పీచు పదార్థం జీరో. కనుక అది జీర్ణం కావాలంటే మన జీర్ణాశయం అష్టకష్టాలు పడాలి. ఇది తింటే ఏం జరుగుతుందో తెలుసుకుందాము.
పరోటాలు తినేవారికి కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం లేకపోలేదు.
పరోటాల వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ పరోటాతో శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగే ప్రమాదం ఉంది.
మైదా తినడం వల్ల ధమనులు మూసుకుపోవడం, అధిక రక్తపోటు వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి.