సాధారణంగా భారతీయులు ఎక్కువగా కారం తింటారు. ముఖ్యంగా చెప్పాలంటే.. హిందువులే కూరల్లో కారం ఎక్కువగా వేస్తారు. కొందరేమో పచ్చిమిరపకాయ వేస్తారు.. మరికొందరేమో ఎండుకారం వేస్తుంటారు. ఏదేమైనా భోజనం మాత్రం కారం లేకుండా తినలేం. కానీ కొందరు మాత్రం కారం తినేందుకు విముఖత ప్రదర్శిస్తుంటారు. ఇప్పుడు చెప్పబోయే విషయం తెలిస్తే.. వారు కూడా ఇకపై కారం అంటే ఇష్టంగానే తింటారు.
చాలామంది తరచు అధిక బరువు తగ్గించడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు.. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. బరువు మాత్రం కాస్త కూడా తగ్గలేదని సతమతమవుతుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. అప్పుడప్పుడు మిరపకాయలతో తయారుచేసిన ఆహార పదార్థాలు తింటుంటే.. ఫలితం ఉంటుంది. ఎందుకంటే.. మిరపకాయల్లో ఉండే క్యాప్సెయిసిన్ అనే ఆమ్లం అధిక బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా శరీర వాపులను తగ్గిస్తుంది.