Anaconda: వామ్మో.. ఒడ్డుపై నుంచి నీటిలోకి దూకింది.. షాకైన పర్యాటకులు

సెల్వి

గురువారం, 11 సెప్టెంబరు 2025 (18:38 IST)
Anaconda
ఒక పచ్చని అటవీ ప్రాంతంలో ఉన్న నదిలో కొంతమంది పర్యాటకులతో ఒక పడవ ప్రయాణిస్తుంది. చివరికి వారు ఒక ఒడ్డుకు చేరుకున్నారు. అలా ఒడ్డుకు చేరుకున్న సమయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక భారీ అనకొండ పాము విశ్రాంతి తీసుకొని ఒడ్డు నుంచి నీటిలోకి దూకింది. 
 
అంతే పర్యాటకులందరూ ఖంగుతిన్నారు. పాము నెమ్మదిగా అక్కడి నుంచి బయటికి రావడం చూసిన పర్యాటకులు అలాగే పడవలు ఉండిపోయారు. అంతేకాకుండా ఓ పర్యాటకుడు భయంతో ఊగిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
 
ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ షేర్ అవుతోంది. ఇది అనకొండ పాము అని నీటిలోకి దూకగానే పర్యాటకులకు గుండె ఆగిపోయి వుంటుందని.. తప్పకుండా ఈ సీన్ భయానకమేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు