వాము లేదా వామ్ము.. కేవలం వంటల్లోనే కాదు అనారోగ్యాలను తరిమి కొట్టడంలోనూ వాము ఉపయోగపడుతుంది. వాము వేయడం వల్ల వంటకాలకు చక్కని రుచి, సువాసన వస్తుంది. అలాగే, ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా నయం చేస్తుంది. వాటిని ఓసారి పరిశీలిద్ధాం.
ఒక టీస్పూన్ వాము, ధనియాలు, జీలకర్రలను తీసుకుని మూడింటినీ కలిపి పెనంపై దోరగా వేయించాలి. అనంతరం ఆ మిశ్రమంతో కషాయం తయారు చేసుకోవాలి. దీన్ని తాగుతుంటే జ్వరం తగ్గుతుంది.