చేదు మాత్రం మింగేముందు ఐస్ ముక్క నోట్లో వేసుకుంటే...
సోమవారం, 25 జూన్ 2018 (09:20 IST)
చాలా మందికి మాత్రలు మింగాలన్నా.. ఏదేని మందు తాగాలన్నా తెగ కష్టపడిపోతారు. వైద్యులు చెప్పినట్టుగా మందులు తీసుకునేందుకు సుతరామా ఇష్టపడరు. ఇలాంటి చిన్నపాటి చిట్కాను పాటిస్తే మాత్రను సులభంగా మింగవచ్చు. అవేంటో ఓసారి పరిశీలిద్ధాం.
* చేదు మాత్రలు లేదా టానిక్ వంటి మందులు తీసుకునే ముందు.. ఓ ఐస్ ముక్కను నోట్లో వేసుకోవడం వల్ల ఔషధం చేదుగా అనిపించదు.
* వాంతులు అదేపనిగా వస్తుంటే ఐస్ ముక్కను చప్పరిస్తే ఉపశమనం కలుగుతుంది.
* శరీరంలో ఎక్కడైనా గాయం తగిలి రక్తం తదేకంగా కారుతుంటే దానిపై ఐస్ ముక్క ఉంచినట్టయితే రక్తం కారడం ఆగిపోతుంది.
* ముల్లు గుచ్చుకుని నొప్పి అధికంగా ఉంటే ఆ ప్రాంతంలో ఐస్ ముక్క ఉంచితే తక్షణం ఉపశమనం కలుగుతుంది.
* తీసుకున్న ఆహారం జీర్ణంకాకుంటే ఐస్ ముక్కను చప్పరించండి. దీంతో ఆహారం త్వరగా జీర్ణమౌతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.