చాలా మందికి తిన్న ఆహారం సరిగా జీర్ణంకాదు. ఈ సమస్యకు ప్రధాన కారణం అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలేనని వైద్య నిపుణులు చెపుతున్నారు. అలాగే వేళ తప్పించి భోజనం చేయడం, మద్యపానం, ధూమపానం, బాక్టీరియా ఇన్‌ఫెక్షన్ తదితర కారణాల వల్ల కూడా కొందరిలో అజీర్ణ సమస్య వస్తుంటుంది. ఇలాంటి వారు చిన్నపాటి చిట్కాలను పాటిస్తే ఈ సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చని వైద్యులు చెపుతున్నారు. మరి ఆ చిట్కాలు ఏంటో ఓసారి పరిశీలిద్ధాం.
* అజీర్ణ సమస్యకు చక్కటి పరిష్కారం అల్లం. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా అల్లం ముక్కలు వేసి ఆ నీటిని బాగా మరిగించాలి. అనంతరం అల్లంలో ఉండే సారం ఆ నీటిలోకి చేరుతుంది. ఆ తర్వాత గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల తిన్న ఆహారం జీర్ణమవుతుందట. అలాగే, అల్లం ముక్కలను దంచి రసం తీసి ఆ రసాన్ని సేవించినా కూడా సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని వైద్యులు చెపుతున్నారు.
* గుప్పెడు వాము తీసుకుని అందులో కొంత ఉప్పు వేసి బాగా నలిపి ఆ మిశ్రమాన్ని తినాలి. వెంటనే నీరు తాగాలి. దీంతో గ్యాస్, అసిడిటీ, అజీర్ణం సమస్య గణనీయంగా తగ్గిపోతుంది.