షుగర్ వ్యాధి అనగానే ఏది తినాలన్నా భయమేస్తుంది. అందుకనే వ్యాధి సంక్రమిస్తే జీవనశైలిలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అందుకనే వైద్యులు పత్యం పాటించాలని చెపుతుంటారు. ఆయుర్వేదంలో కూడా షుగర్ వ్యాధిని తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలున్నాయి. ప్రతి రోజూ కాకరకాయ రసం త్రాగితే మధుమేహం పారిపోతుందని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు. కాకర రసం చేదుగానే ఉంటుంది. కాకర కాయను తినడానికే కాసింత చక్కెర వేసి మరీ తింటుంటారు. అందునా కాకర రసం త్రాగడం అంటే కాస్త కష్టంగానే ఉంటుంది. మధుమేహానికి మందుగా కాకర రసం సూచించడం వరకు బాగానే ఉంటుంది.