గచ్చకాయ రక్త దోషాలను, కఫాన్ని, వాతాన్ని నివారించగలదు.
వీటికి జీర్ణశక్తి పెంచే గుణం వుంది. రక్తవృద్ధికి తోడ్పడే శక్తి వుంది.
గచ్చకాయ గింజలు మూత్ర సమస్యలను నయం చేయగలవు.
మధుమేహం తగ్గటానికి కూడా వీటిని ఉపయోగిస్తారు. వాపులు, కీళ్లనొప్పులను నయం చేసే గుణం వీటికి వుంది.
చర్మ వ్యాధులు, అల్సర్లు, పైల్స్ వంటి వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు.
గచ్చకాయను పగులగొట్టి వాటి గింజలను గ్లాసు నీటిలో రాత్రిపూట నానబెట్టి ఆ నీటిని తాగితే మధుమేహం కంట్రోల్ అవుతుంది.
బట్టతలపై జుట్టు వచ్చేందుకు గచ్చకాయ గింజల తైలాన్ని వాడుతారు.
గచ్చకాయ ఆకులను ఆముదంలో వేయించి కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వున్నచోట కట్టుకడితే నొప్పులు తగ్గుతాయి.