ఈ పండ్లను తినడం వల్ల ఇన్ఫెక్షన్‌లను తట్టుకునే వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. రక్తస్రావాన్ని అరికడతాయి. శరీరానికి చక్కని శక్తిని అందిస్తాయి. ఈ పండ్లను తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి, గుండెజబ్బులు దూరమవుతాయి.
ఈ పండ్లలోని టానిన్ పెద్ద పేగులోని సమస్యలకు చెక్ పెడుతుంది. ఖర్జూరాల నుండి తీసిన గుజ్జును తీసుకుంటే జలుబు, శ్లేష్మం, గొంతునొప్పి త్వరగా తగ్గిపోతుంది. కిడ్నీలోని రాళ్ళను కరిగించగల శక్తి ఖర్జూరానికి ఉంది. యూరినల్ ఇన్ఫెక్షన్లలను నియంత్రిస్తుంది.