చంద్రుడితో గురుడు, శని, అంగారక గ్రహాలు ఒకే వరుసలోకి రానున్నాయి.
ఈ ఖగోళ సంఘటన ఏప్రిల్ 14, 15, 16వ తేదీల్లో జరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కాలుష్య తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో బైనాక్యులర్స్, టెలిస్కోప్ సాయం లేకుండానే ఆ రమణీయమైన దృశ్యాన్ని నేరుగా ఆస్వాదించవచ్చని చెప్పారు.
గురుడు, శని, అంగారక గ్రహాలని మార్నింగ్ ప్లానెట్స్ అని అంటారు. అంటే అవి ఉదయాన స్పష్టంగా కన్పిస్తుంటాయి. ఏప్రిల్ మధ్యలో ఈ మూడు గ్రహాలు ఒకే వరుసలో కన్పిస్తుంటాయి. అయితే వాటితో పాటు ఈ సారి చంద్రుడు కూడా అదే వరుసలో కనిపించనున్నాడు. ఏప్రిల్ 14, 15, 16వ తేదీల తర్వాత అంగారక గ్రహం వీటి నుంచి దూరంగా కదులుతుంది.