అమ్లపిత్త రోగంతో బాధపడుతుంటే తీసుకోవలసిన ఆహార పదార్థాలు: కలకండ, ఉసిరికాయ, గులకంద్, ఎండుద్రాక్షను ఆహారంగా సేవించాలి. తోటకూర, సొరకాయ, కాకరకాయ, కొత్తిమిర, దానిమ్మపండు, అరటిండు మొదలైనవి తీసుకోవాలి. పాలను నియమానుసారం సేవించాలంటున్నారు ఆరోగ్యనిపుణులు.
తినకూడని ఆహార పదార్థాలు: మసాలాలు ఎక్కువగానున్న ఆహార పదార్థాలు, చేపలు, మాంసాహారం, మద్యపానం, ఎక్కువ భోజనం, వేడి-వేడి టీ లేదా కాఫీ, పెరుగు మరియు మజ్జిగ సేవించకూడదు. అలాగే కందిపప్పు మరియు ఉద్దిపప్పును ఎట్టి పరిస్థితుల్లోను ఆహారంగా తీసుకోకూడదు.