కడుపులో మంటతో సతమతం... తిన్న వెంటనే వ్యాయామం చేసేవారు...

ఆదివారం, 23 సెప్టెంబరు 2018 (18:19 IST)
పొట్టలో గ్యాస్, నొప్పి, మంట... ఇలా పలు రకాల సమస్యలతో బాధపడుతుంటారు. ఏదో ఒకటిరెండుసార్లు ఇలాంటి సమస్యలు ఎదురయితే ఫర్వాలేదు కానీ తరచూ ఇబ్బంది వస్తుంటే మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి.
 
1. ఎలాంటి పదార్థాలు తీసుకున్నప్పుడు ఇలా కడుపు నొప్పి వస్తుందో చెక్ చేసుకోవాలి. ఆ పదార్థాలను గమనించాక వాటికి కొంతకాలం దూరంగా వుండాలి. అప్పుడు సమస్య తగ్గిన తర్వాత ఈ విషయాన్ని వైద్యుని దృష్టికి తీసుకెళ్లాలి.
 
2. జీర్ణ సంబంధమైన సమస్యలుంటే స్వల్పంగా ఆహారం నాలుగైదు సార్లు తీసుకోవడం మంచిది. ఆహారం నోట్లో వేసుకుని ఎక్కువసేపు నమిలి తినాలి. ఇలా చేయడం వల్ల తినే ఆహారం సుళువుగా జీర్ణమవుతుంది. 
 
3. జీర్ణసమస్యలతో సతమతమయ్యేవారు ఆహారాన్ని వేగంగా తినడం మానుకోవాలి. ఇలా చేస్తే గాలి లోపలికి వెళ్లి గ్యాస్ సమస్య ఏర్పడుతుంది. అలాగే కూల్ డ్రింక్సుకు స్వస్తి చెప్పాలి. 
 
4. తిన్న వెంటనే కొందరు వ్యాయామం చేస్తుంటారు. ఇలాంటి అలవాటును మానుకోవాలి. అలాగే వారంలో మూడుసార్లు ప్రాణాయామం చేయడం మంచిది. ఇలా చేస్తే జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. 
 
5. ముఖ్యంగా ఉదర సంబంధ సమస్యలతో బాధపడేవారు బయటి ఆహారానికి దూరంగా వుండాలి. మంచినీళ్లు సైతం ఇంట్లోవే తాగడం మంచిది. అలా కాకుండా బయటవి తీసుకుంటే ఉదర సమస్య తిరగబెట్టడం ఖాయం. ఇలా ఉదర సమస్యలను జాగ్రత్తగా పరిశీలిస్తూ వాటిని దూరం చేసుకోవాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు