ఆ ప్రాంతంలో జిల్లేడు పాలు అద్దితే..?

గురువారం, 8 నవంబరు 2018 (10:18 IST)
ఎప్పుడైనా తేలు కుట్టినప్పుడు ఆ ప్రాంతంలో మంటగా ఉంటుంది. కొందరికైతే భయంలో వణుకు, చెమట విపరీతంగా చెమట పట్టడం, వాంతులు, విరేచనాలు వచ్చే అవకాశాలున్నాయి. మరి తేలు కుట్టునప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం...
  
 
తేలు కుట్టగానే బెత్తెడుపైన గట్టిగా గుడ్డతో కట్టు కట్టి శరీరంలో విరిగిన ముల్లును తీసేయాలి. మళ్లీ అరగంట కొకసారి తీసి తిరిగి కట్టు కట్టాలి. లేకపోతే రక్తప్రసరణ జరగక కింది భాగంలో చచ్చుబడిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే.. కుంకుడుకాయను అరగదీసి ఆ గంధాన్ని తేలు కుట్టి ప్రాంతంలో రాసుకుని నిప్పు సెగ చూపితే విషం లాగేస్తుంది. దాంతో బాధనుండి ఉపశమనం లభిస్తుంది.  
 
నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు కుంకుడు గింజల్లోని పప్పును మింగితే కూడా విష ప్రభావం తగ్గుముఖంపడుతుంది. తేలు కుట్టినప్పుడు నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి కుంకుడు గింజలు ఆ సమయంలో తీసుకున్నప్పుడు అవి తియ్యగా ఉంటాయి. దాంతో పాటు కప్పు నీటిలో కొద్దిగా ఉప్పు కలిగి తీసుకుంటే కూడా నొప్పి తగ్గుతుంది. తేలు కుట్టిన ప్రదేశంలో జిల్లేడు పాలు అద్దితే కూడా శరీరంలో విషం పోతుందని వైద్యులు చెప్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు