* ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో ఉల్లిపాయ పొట్టును వేయాలి. అనంతరం ఆ పాత్రను కిటికీలు లేదా గుమ్మం వద్ద పెడితే ఇంట్లోకి దోమలు, ఈగలు రావు. ఉల్లిపాయ పొట్టు నుంచి వచ్చే వాసన వాటికి పడదు. అందుకే అవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి.
* ఉల్లిపాయ పొట్టును రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే పొట్టు తీసేసి ఆ నీటిని శరీరానికి పూసుకుంటే చర్మ సమస్యలు మటుమాయమైపోతాయి. అలాగే, నొప్పులు, వాపులు ఉన్నచోట రాసుకుంటే అవి క్రమంగా తగ్గిపోతాయి.
* ఉల్లిపాయ పొట్టుతో సూప్ చేసుకుని తాగితే దాంతో శరీరంలో ఉన్న ఇన్‌ఫెక్షన్లు నయమవుతాయి. ఎందుకంటే ఆ సూప్ యాంటీ బయోటిక్, యాంటీ ఫంగల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. అందుకే ఇన్‌ఫెక్షన్లు మాయమైపోతాయి. ఇలా అనేక ఉపయోగాలు ఉన్నాయి.