దానిమ్మ అందం, ఆరోగ్యం...

శుక్రవారం, 26 అక్టోబరు 2018 (10:32 IST)
దానిమ్మ చూడానికి ఎంత అందంగా ఉంటుందో.. ఆరోగ్యానికి కూడా అంతే రుచిగా ఉంటుంది. మరి దీనిలోని ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.. శరీరంలోని ద్రవాల సమతుల్యతను దానిమ్మ కాపాడుతుంది. దానిమ్మపండులోని పొటాషియం అనే పదార్థం రక్తపోటును నియంత్రిస్తుంది. దానిమ్మ తినడానికి చాలా మంది ఇష్టపడరు. ఎందుకంటే.. దాని తొక్కలు తీసేందుకు చాలా సమయం పడుతుంది. అందుకు దీనిని తీసుకోవలసిన అవసరమేమి లేదని కొందరు భావిస్తుంటారు.
 
తొక్కను ఒక సమస్యగా తీసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారనే విషయం చాలా కష్టమే. అందువలన ప్రతిరోజూ దానిమ్మపండు తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చాలామంది బరువు తగ్గాలని ఏవేవో చేస్తుంటారు.. అవన్నీ ఆరోగ్యానికి అంత మంచివి కావు.. కాబట్టి రోజూ ఉదయాన్నే గ్లాస్ దానిమ్మ జ్యూస్ తీసుకుంటే నెలరోజుల్లో బరువు తగ్గుతారు. 
 
దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి టైప్-2 అంటే మధుమేహ వ్యాధిని నివారిస్తాయి. దాంతో పాటు ప్రోస్టేట్, బ్రెస్ట్, కోలన్, లుకేమియా వంటి క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతుంది. దానిమ్మలోని ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కడుపులోని మంటను, ఇన్ఫెక్షన్స్‌ నుండి వెంటనే ఉపశమనం కలిగిస్తాయి. అజీర్తిని తొలగిస్తుంది. 
 
దానిమ్మలోని పోషక విలువలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దాంతో రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. అలానే దానిమ్మ తొక్కలను ఎండబెట్టి పొడిచేసి అందులో కొద్దిగా నిమ్మరసం, నీరు కలిపి ముఖానికి రాసుకుంటే మెుటిమలు తొలగిపోతాయి. తద్వారా ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు