యవ్వనంగా ఉండాలంటే రోజూ దాన్ని ఓ ముక్క నోట్లో వేసుకోండి!!

మంగళవారం, 13 అక్టోబరు 2020 (12:03 IST)
సహజమైన తియ్యదనంతో కూడిన బెల్లాన్ని ప్రతి రోజూ ఓ ముక్క ఆరగిస్తే అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా, నిత్యం యవ్వనంగా ఉండాలంటే ప్రతి రోజూ ఓ బెల్లం ముక్కను నోట్లో వేసుకుంటే మంచిదని వారు చెబుతున్నారు. 
 
నిజానికి చక్కెర కంటే బెల్లం ఎంతో మంచిది. కానీ, ఇపుడు మెజార్టీ ప్రజలు బెల్లం కంటే చక్కెరనే ఎక్కువగా వినియోగిస్తుంటారు. బెల్లం నోటికి తీపిని ఇవ్వడమే కాదు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. 
 
బెల్లంలో ఇరన్‌, మినరల్స్‌ ఎక్కువగా ఉంటాయి. అందుకే బెల్లం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆహారంలో ప్రతి రోజులు బెల్లం తీసుకోవడం వల్ల రక్త హీనత సమస్యకు చెక్‌ పెట్టవచ్చు.
 
జలుబు చేసినప్పుడు ఒక ముక్క బెల్లం తీని గోరువెచ్చని నీరు తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇది ప్రాథమిక చికిత్సగా పనిచేయడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నిత్యం బెల్లం తీసుకోవడం వల్లే యవ్వనం పెరుగుతంది.
 
ముఖంపై ఏర్పడే మచ్చలు, చర్మంపై ముడతలను తొలగించి మంచి నిగారింపు ఇస్తుంది. రోజూ బెల్లం ముక్క తినడం వలన వెంట్రుకలు ఊడిపోయే సమస్య నుంచి కొంతమేరకు గట్టెక్కవచ్చు. 
 
ఇందుకోసం గోరు వెచ్చని నీటితో బెల్లం తీసుకోవాలి. టీ, కాఫీల్లో చక్కెరకు బదులు బెల్లం వాడితో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు