ఉసిరి కాయలను తేనెలో ఊరబెట్టి తింటే కలిగే ఫలితాలు ఏమిటి?

సిహెచ్

శనివారం, 24 ఫిబ్రవరి 2024 (20:03 IST)
తేనె. దీనివల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఉసిరి కాయల వల్ల కూడా అనేక రకాల ఆరోగ్యకరమైన ఫలితాలు లభిస్తాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
నీడలో ఆరబెట్టిన ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి వాటిని ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. 
ఇలా తేనె, ఉసిరికాయ మిశ్రమాన్ని తయారుచేసి తీసుకోవడం వల్ల లివర్ సమస్యలు దూరమవుతాయి.
జాండిస్ వంటి వ్యాధులు ఉంటే అవి త్వరగా నయం అవుతాయి.
శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటికి పంపడంలో లివర్ మరింత చురుగ్గా పనిచేస్తుంది.
తేనె, ఉసిరి మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటుంటే చర్మపు ముడతలు తగ్గి యవ్వనంగా కనిపిస్తుంది. 
తేనె, ఉసిరి మిశ్రమం తీసుకుంటుంటే ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది.
తేనె, ఉసిరితో దగ్గు, జలుబు, గొంతు ఇన్‌ఫెక్షన్ వంటి వ్యాధులు నయమవుతాయి. 
తేనె, ఉసిరి మిశ్రమం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు కరిగి అధికంగా ఉన్న బరువు తగ్గుతారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు