రోజూ అల్లం రసం తాగితే ఏమవుతుంది..?

శనివారం, 30 మార్చి 2019 (10:29 IST)
అసిడిటీ, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఇవన్నీ జీర్ణ సమస్యల కిందకు వస్తాయి. అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తాయంటే శరీరం జీర్ణవ్యవస్థ పనితీరు సరిగ్గా జరుగకపోవడమే ఇందుకు కారణం. ఇప్పటి కాలంలో చాలామంది అంటే.. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అజీర్తితో ఎక్కువగా బాధపడుతున్నారు. వీటన్నింటికి చెక్ పెట్టాలంటే.. ఈ ఆహారాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
రోజుకో యాపిల్ పండు తింటే అజీర్తి సంబంధించిన మందులు, మాత్రలు వాడాల్సిన అవసరం ఉండదు. అలానే రోజు తినాల్సిన ఆహారాల్లో అరటిపండు కూడా తీసుకోవాలి. ఎందుకంటే అరటిపండులోని పొటాషియం, ఫైబర్ వంటి ఖనిజాలు జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి. జీర్ణవ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. ముడిబియ్యం, గోధుమలు వంటి ధాన్యాల్లో ఫైబర్ అనే ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తాయి. ఆజీర్ణం సమస్య తగ్గేలా చేస్తాయి. 
 
రోజూ ఉదయాన్నే పరగడుపున ఒకటి లేదా రెండు స్పూన్ల అల్లం రసం తాగితే జీర్ణ సమస్య ఉండవు. అల్లం రసం తాగడం వలన వికారం, మార్నింగ్ సిక్‌నెస్, అజీర్ణం వంటి సమస్యలకు మంచి మెడిసిన్‌గా పనిచేస్తుంది. నేరుగా అల్లం రసం తీసుకోలేనివారు అల్లాన్ని రోజూ మూడు విడతలుగా ఆహారంలో 2 గ్రాముల చొప్పున తీసుకున్నా చాలు ఫలితం ఉంటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు