పగటి పూట కునుకు ఆరోగ్యానికి మంచిదేనా?

గురువారం, 27 సెప్టెంబరు 2018 (15:05 IST)
చాలా మందికి పగటిపూట ఓ కునుకు తీసే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు ఉన్న ఉద్యోగస్తులు అయితే నానా ఇబ్బందులు పడుతుంటారు. నిజానికి పగటిపూట కునుకు, పగటిపూట కునుకుతో ఆరోగ్యానికి మంచిదా? కాదా? అనేది తెలుసుకుందాం.
 
* నిజానికి కునుకు తీయటానికి సరైన సమయమంటూ ఏదీ లేదు గానీ.. మధ్యాహ్నం 1-4 గంటల మధ్య పడుకోవటం మేలు. 
* పగటిపూట ఎక్కువగా సేవు కునుకు తీయరాదు. 
* ముఖ్యంగా సాయంసంధ్యవేళలలో అస్సలు నిద్రపోరాదు. 
* ఎక్కువసేపు కునుకు తీయడం వల్ల మగతగా అనిపిస్తుంది. పైగా ఇది చురుకుదనాన్ని తగ్గిస్తుంది. 
* సెలవురోజుల్లోనూ గంట కన్నా ఎక్కువసేపు కునుకు తీయొద్దు. ఇది రాత్రి నిద్రను దెబ్బతీస్తుంది.
* సాధారణంగా ఈ సమయంలో మన జీవగడియారం నిద్ర వస్తున్న భావన కలగజేస్తుంటుంది.
* నిద్రలేమి, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు పగటిపూట నిద్రపోకపోవటం ఉత్తమం. 
* పగటినిద్రతో వీరిలో సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశముంది.
* కునుకు పట్టినపుడు కలలు కూడా వస్తుంటే.. రాత్రిపూట సరిగా నిద్రపోవటం లేదనే అర్థం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు