చాలా మంది భోజన ప్రియులు తమకు ఇష్టమైన కాంబినేషన్లు కంటికి కనిపిస్తే చాలు లొట్టలేసుకుని ఆరగించేస్తుంటారు. తమకు నచ్చిన కాంబినేషన్ లేకపోతే ముద్ద దిగడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే, కొన్ని కాంబినేషన్లు ఎంత రుచిగా ఉంటాయో అంతే డేంజర్ కూడా. ఇలాంటి ఆహారం తినడం వల్ల వెంటనే ఎలాంటి ప్రభావం కనిపించకపోయినా.. క్రమేణా విషతుల్యమయ్యే ప్రమాదం లేకపోలేదని పౌష్టికాహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి అలాంటి డేంజర్ కాంబినేషన్లు ఏంటో ఓసారి పరిశీలిద్ధాం.
మాంసం - పాలు: పాలతో కలిపి చేపలు, చికెన్ వంటి మాంసాహారం తినకూడదు.
పెరుగు - పండ్లు: పుల్లని పండ్లను పెరుగుతో కలిపి తీసుకోకూడదు. దీనివల్ల కడుపులో యాసిడ్స్ ఏర్పడి జీవక్రియపై ప్రభావం చూపుతాయి
పాలు - నిమ్మకాయ: పాలలో నిమ్మకాయ కలిపితే విరిగిపోతాయనే సంగతి తెలిసిందే. కడుపులోకి వెళ్లినా ఇలాగే జరుగుతుంది. కడుపులో ఉండే జీర్ణరసాల్లో నిమ్మకాయ కంటే అత్యధిక యాసిడ్ గుణాలు ఉంటాయి. పాలు, నిమ్మ కాంబినేషన్ విషంగా మారే ప్రమాదం ఉంది.