* మంగ చెట్టు కాండపు బెరడును ఎండించి చూర్ణం చేసి, ఆ చూర్ణాన్ని కొంచెం నువ్వుల నూనెలో కలిపి, నొప్పిగా ఉన్న చోట మర్దన చేస్తే కండరాల నొప్పులు తగ్గుతాయి.
* మంగచెట్టు బెరడునుగానీ, వేరు బెరడునుగానీ, మెత్తగా నూరి కుంకుడుకాయలా తలకు రుద్దితే, నేత్రవ్యాధులు, తలనొప్పి తగ్గుతాయి. పేలు చనిపోతాయి. ఇది మెదడుకు, కళ్లకు చలువ చేయడంతో పాటు శిరోవాతం తగ్గిపోతుంది.
* మంగకాయ, అతి మధురం ఈ రెంటినీ సమానంగా తీసుకుని, చూర్ణం తయారు చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని 3 గ్రాముల మోతాదులో రోజూ రెండు పూటలా తీసుకుంటే ఆస్తమా, ఎలర్జిక్ రైనైటిస్ సమస్యలు తగ్గిపోతాయి.