రోజూ ఊలాంగ్ టీ తాగితే..?

మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (10:35 IST)
ప్రస్తుతం అనేక రకాల టీలు లభిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్క టీ మనకు ఏదో ఒక రకమైన ఆరోగ్యకర ప్రయోజనాన్ని అందిస్తుంది. అయితే అలాంటి ఆరోగ్యకరమైన టీలలో ఊలాంగ్ టీ కూడా ఒకటి. ఈ టీని నిత్యం తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం..
 
ఊలాంగ్ టీని తాగడం వలన శరీరం మనం తినే ఆహారంలో ఉండే కొవ్వును శోషించుకోవడం మానేస్తుంది. దాంతో శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. తరచు డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారు నిత్యం ఊలాంగ్ టీ తాగితే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. వ్యాధి నియంత్రణలో ఉంటుంది. 
 
శరీరంలో చెడుకొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు నిత్యం ఊలాంగ్ టీని తాగితే ఫలితం ఉంటుంది. నిత్యం ఒత్తిడి, ఆందోళన ఎదుర్కునే వారు ఊలాంగ్ టీ తాగితే మనస్సు ప్రశాంతంగా మారుతుంది. రిలాక్స్ అవుతారు. 
 
ఊలాంగ్ టీ తాగడం వలన అధిక బరవు త్వరగా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఊలాంగ్ టీ తాగితే మన శరీరంలో కొవ్వు కరిగే రేటు 12 శాతం వరకు పెరుగుతుందట. దీంతో కొవ్వు త్వరగా కరిగి బరువు వేగంగా తగ్గుతారని వారు చెప్తున్నారు. కనుక ఊలాంగ్‌ని నిత్యం తాగితే అధిక బరువును ఇట్టే తగ్గించుకోవచ్చును. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు