ఈ సోదాల్లో ప్రాథమికంగా అతని ఆయన వద్ద రూ.1.15 కోట్ల విలువైన ఇళ్ల ఆస్తులు, రూ.1.42 కోట్ల విలువైన 17 ఎకరాల 10 గుంటల వ్యవసాయ భూమి పత్రాలు, రూ.23.84 లక్షల విలువైన 70 తులాల బంగారు ఆభరణాలు, రూ.92.000 విలువైన 1.791 గ్రాముల వెండి వస్తువులు, రూ.34.78 లక్షల విలువైన రెండు కార్లు, ఒక బైక్, రూ.3.28 లక్షల విలువైన 23 చేతి గడియారాలు, రూ.16.43 లక్షల విలువైన గృహోపకరణాలు ఉన్నట్లు వెల్లడైంది. ఆస్తుల మొత్తం విలువ రూ.5.02 కోట్లు.
అదనపు ఆస్తులపై మరింత తనిఖీ జరుగుతోందని, ప్రస్తుత మార్కెట్ విలువలు ప్రభుత్వ అంచనా కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని ఎసిబి అధికారులు తెలిపారు. ఇంకా బండి నాగేశ్వర రావును అరెస్టు చేసి వరంగల్‌లోని ఎసిబి కేసుల ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరుస్తున్నట్లు ఎసిబి అధికారులు తెలిపారు.