ఈ నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు మెండు. అందుకే వీటిని 'పవర్ హౌజ్' అని పిలుస్తారు. నువ్వుల్లో ఐరన్, జింక్, కాల్షియం, థయామిన్, ఇతర మినరల్స్‌తో పాటు విటమిన్ 'ఇ' కూడా సమృద్ధిగా ఉంటుంది. అలాంటి నువ్వుల వల్ల కలిగే ఉపయోగాలేంటో ఓసారి తెలుసుకుందాం.
* నువ్వుల్లో అధిక శాతం జింక్, కాల్షియంలు ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతాయి. అందుకే ఎముకుల దృఢత్వం కోసం నువ్వులను ప్రతి రోజూ ఉదయం పరగడుపున ఓ టీ స్పూన్ నువ్వులను బెల్లంతో ఆరగించినట్టయితే ఎముకలకు, వెన్నుపూసలకు సంబంధించిన సమస్యలు పూర్తిగా మటుమాయమైపోతాయి.