ఉదయాన్నే పరగడుపుతో తినడానికి ఉత్తమమైన ఆహారాలు ఇవే

సోమవారం, 30 అక్టోబరు 2023 (21:18 IST)
ఉదయాన్నే ఏదిబడితే అది తింటే గ్యాస్ సమస్య, అజీర్తి తలెత్తవచ్చు. అందువల్ల ఉదయంవేళ ఖాళీ కడుపుతో తినడానికి ఉత్తమమైన ఆహారాలు ఏమిటో తెలుసుకుని తింటే ప్రయోజనాలుంటాయి. అవేమిటో తెలుసుకుందాము. గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 టేబుల్ స్పూన్ తేనె, సగం చెక్క నిమ్మబద్ద రసాన్ని తీసి కలిపి త్రాగాలి.
 
శారీరక శక్తిని పెంచడానికి, సహజంగా, బాడీ సిస్టమ్‌ను నిర్విషీకరణ చేయడానికి ఖాళీ కడుపుతో తాజా పండ్లు తినాలి. 90% నీరు, ఎలక్ట్రోలైట్స్‌తో నిండివుండే పుచ్చకాయలను ఖాళీ కడుపుతో తీసుకోవడం మంచిది. ఉదయాన్నే బొప్పాయి తింటే అది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని నమ్ముతారు.
 
ప్రతిరోజూ ఉదయం 8-10 బాదంపప్పులు నీటిలో నానబెట్టినవి తింటే ఆరోగ్యకరం. కోడిగుడ్లు. ఇవి రోజంతా తక్కువ కేలరీలు వినియోగించేలా చేస్తాయి, తద్వారా దీర్ఘకాలంలో కొవ్వు తగ్గడానికి సహాయపడుతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు