కచ్చూర చిన్న ముక్కను బుగ్గన పెట్టుకుని రసం మింగుతుంటే...

మంగళవారం, 25 జులై 2017 (21:49 IST)
స్వరం అందంగా ఉండాలని అందరు అనుకుంటారు. దీనికోసం కర్చూరాలతో వైద్యం కర్చూరాలు పెద్దపెద్ద పచారీ దుకాణాల్లో చిన్నచిన్న దుంపలు రూపంలో దొరుకుతాయి. కచ్చూరాలు సువాసన గల దుంపలు, వీటిని చితకకొట్టి, కొబ్బరినూనెలో వేసుకొని తలకు రాసుకుంటారు. అలా చేయడం వలన వెంట్రుకలు మృదువుగా వుంటాయి.
 
దీన్ని చిన్ని ముక్కలుగా చేసి ఓ చిన్ని ముక్కను బుగ్గన పెట్టుకుని రసం మింగుతూ ఉంటే కంటధ్వని శ్రావ్యంగా వుంటుంది. కచ్చూరం, మిరియాలు మెత్తగా దంచి పాలలో వేసి, ఆ పాలని సగం వచ్చేలా మరిగించి, వడగొట్టి అందులో పంచదార వేసుకొని తాగితే గొంతులో నొస, దగ్గు, అయాసం, ఉబ్బసం తగ్గుతాయి.

వెబ్దునియా పై చదవండి