జీర్ణ సమస్యలకు చికిత్స చేసేందుకు మామిడి అల్లం ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఆయుర్వేదంలో దీనిని ఉపయోగించడం ద్వారా శ్వాస సమస్యలను తగ్గిస్తారు.
మొటిమలు, దురద వంటి చర్మ సమస్యలకు మామిడి అల్లం ఎంతో ప్రయోజనకరంగా వుంటుంది.
మామిడి అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు వున్నందువల్ల ఆర్థరైటిస్ వల్ల వచ్చే కీళ్లవాపు నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఆకలి పెరిగేందుకు మామిడిఅల్లం జోడించిన ఆహారాన్ని తింటుంటే ఫలితం వుంటుంది.
మామిడి అల్లం, నువ్వుల నూనెతో మర్దన చేస్తుంటే నొప్పులు తగ్గుతాయి.