మూలం వ్యాధి నివారణకు అరుదైన చికిత్స హోమియోపతి

ఆదివారం, 3 జూన్ 2007 (18:52 IST)
మూలం, పిత్తం, వాతం వంటి వ్యాధుల నివారణకు హోమియోపతి వైద్యం అనువైనదిగా వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా మూలం వ్యాధి నివారణకు హోమియోపతి మందును రోజుకు నాలుగు పూటల తీసుకున్నట్టయితే ఈ వ్యాధి కొంత వరకు నివారణ అవుతుంది. అయితే.. ఈ వ్యాధి లక్షణాలు రోగి ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

ఎలాంటి ఇతర చెడు ప్రభావాలు చూపకుండా మూలం వ్యాధికి హోమియోపతి వైద్యంలో మందులు ఉన్నట్టు హోమియోపతి వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వీటిలో Nuy vomic, Bryonia, Sulphur, Nurvomica,Hamamelis, Milifolium వంటి మందులను హోమియోపతిలో ముఖ్యమైనవి.

ముఖ్య గమనిక.. హోమియోపతి మందులను తీసుకునే వారు ఎట్టి పరిస్థితుల్లోను కాఫీ తీసుకోరాదని, అలాగే ఈ మందులు ఉంచిన చోట కర్పూరం, అమృతాంజన్ వంటి వాటిని ఉంచరాదని సంబంధిత వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

వెబ్దునియా పై చదవండి