Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

దేవీ

బుధవారం, 11 జూన్ 2025 (19:23 IST)
Varun Tej, Lavanya Tripathi
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట పెళ్లికిముందే వివాహార యాత్రలు వెళ్ళిన సందర్భాలున్నాయి. ఇక ఓ ఇంటివారు అవుతున్నారనే విషయం కూడా వార్తల్లో నిలిచింది. తాజాగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మాల్దీవులలో ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా మాల్దీవులలో పలువురు హీరోలు, హీరోయిన్లు కూడా తమ వ్యక్తిగత జీవితాన్ని గడుపుతుంటారు. తాజాగా వీరి ఇలా టూర్ కు వెళ్ళినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
 
మాల్దీవుల విహారయాత్ర నుండి ఒక కలల క్షణం పంచుకుంటూ వెచ్చదనం,  ఆనందాన్ని ప్రసరింపజేస్తున్నారు. కాగా, 2023 నవంబర్‌లో ఇటలీలో జరిగిన ఒక విలాసవంతమైన డెస్టినేషన్ వివాహంలో వివాహం చేసుకున్నారు. ఈ జంట తరచుగా తమ సెలవుల నుండి అందమైన క్షణాలను పంచుకుంటారు మరియు ఇప్పుడు లావణ్య తమ అంతర్జాతీయ పర్యటనల సమయంలో పంచుకున్న జ్ఞాపకాల సేకరణను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు