జ్వరం.. జలుబు... తలనొప్పికి హోమియోపతి చిట్కాలు

మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (11:10 IST)
హోమియోపతిలో బయోకెమిక్ రెమిడీస్... ఇవి హోమియోపతి మందులకు సహాయక మందులుగా పనిచేస్తాయని చెప్పవచ్చు. ఇవి తాత్కాలిక ఉపశమనాన్ని ఇవ్వడానికి వాడుతారు. మన శరీరములో ఏదైనా మూలకం లోపించినప్పుడు దానిని భర్తీ చేయటానికి దీర్ఘకాలికముగా కూడా వాడవచ్చు. 
 
ఈ రోజు ముందుగా ఫెర్రమ్ ఫాస్ గురించి తెలుసుకుందాం... దీనిని 6x లలో వాడుతారు. క్రింది రుగ్మతలకు ఉపశమనంగా ప్రతి ఒక్కరూ నిర్భయముగా వాడవచ్చు.
1. జ్వరం ( సాధారణ)
2. జలుబు
3. గొంతులో గరగర, నొప్పి, వాపు
4. కళ్లు ఎర్రబారడం, దురద
5. రక్తహీనత
6. శరీరంలో వాపు
7. ఐరన్‌లోపం వల్ల కలిగే ఎనేమియా
8. ఎర్రటి రక్తస్రావములకు ( మొలలు, రుతుస్రావం ఎక్కువ)
9. కొన్ని రకముల చర్మ వ్యాధులకు అలెర్జీ... దురదలకు
10. తలతిప్పడం
 
పైన పేర్కొన్న రుగ్మతలను ఫెర్రమ్ ఫాస్ సమర్థవంతంగా ఎదుర్కొని ఉపశమనాన్ని కలిగించును. వ్యాధి తీవ్రతని బట్టి ఈ మందును ఉపయోగించాల్సి ఉంటుంది. 
 
ఉదాహరణకు జలుబు బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు ప్రతి గంటకీ ఒకసారి వాడవచ్చు. కొంచెం తగ్గిన తర్వాత ప్రతి నాలుగు గంటలకు ఒక మారు నాలుగు మాత్రలు పెద్దలకు, రెండు మాత్రలు పిల్లలకు వెయ్యవచ్చు. 
 
అలాగే శరీరతత్వ వ్యాధులు అంటే రక్తహీనత( అనేమియా) వంటి సమస్యలకు రోజుకు మూడుసార్లు రెండు లేదా మూడు నెలలపాటు వాడవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఐరన్ టాబ్లెట్లు వలె ఇది పనిచేస్తుంది. ఫెర్రమ్ ఫాస్ వాడిన నెల తర్వాత హిమోగ్లోబిన్ శాతం రిపోర్టు ద్వారా గమనించి రక్తకణాల అభివృద్ధిలోని మార్పును గమనించవచ్చు. చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఉండదగినది ఫెర్రమ్ ఫాస్ 6 x. 
 
గమనిక: మూడు రోజులకు మించి 102 డిగ్రీలకు పైన జ్వరం తగ్గకుండా వుంటే మంచి హోమియో వైద్యుని సంప్రదించాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు