సాధారణంగా మన గుండె సవ్వడిని మనం గమనించము. అయితే మనం గమనించే విధంగా గుండె కొట్టుకోవడాన్ని గుండె దడగా భావించవచ్చు. ఇది సాధారణంగా పొగ త్రాగడం వల్ల, అధిక బరువు, గ్యాస్ట్రిక్ సమస్యలు, భయం, మానసిక ఒత్తిడి, శారీరక అలసట వల్ల, కాఫీ, టీలు ఎక్కువగా తాగడం వల్ల తలెత్తుంది. అదేవిధంగా గుండె సంబంధ వ్యాధులలోనూ ఇది కనిపిస్తుంది. హోమియోలో దీనిని నివారించుకటకు ఉపయోగపడే మందులను తెలుసుకుందాం
బెల్లదొన్న 30: ఇది మనిషికి ఉద్రేకం, అధిక శారీరక శ్రమవల్ల కలిగే గుండె దడకు పనిచేస్తుంది. చమొమిల్ల ( కమొమిల్ల)30: ఇది భయం వల్ల కలిగే దడకు ఉపయోగపడును నక్స్ వొమిక 30: అజీర్తి, మలబద్దకం వల్ల కలిగే దడకు పనిచేస్తుంది
అకోనైట్ 30: ముఖం ఎర్రబడి గుండె నొప్పి, భయం, మానసిక అస్థిరత్వం వల్ల కలిగే దడకి పనిచేస్తుంది. డిజిటాలిస్ 30: నీరసం, బలహీన నాడి, కదలిక వల్ల గుండె ఆగిపోతుందనే భావం కలిగి ఉండే గుండె దడకు ఇది వాడవచ్చు కాఫియ 30: అధికముగా కాఫీ, టీ సేవించడం వల్ల కలిగే గుండె దడకు దీనిని వాడవచ్చు మేగ్ ఫాస్ 6X, కాలి ఫాస్ 6 X మరియు ఫెర్రమ్ ఫాస్ 6 X మందులు ఏ విధమైన గుండె దడకైనా పనిచేస్తాయి. -డాక్టర్ మాధురీ కృష్ణ