ధమనుల వ్యాధి నుంచి స్వస్థతకు మూలికల వైద్యం

శనివారం, 1 డిశెంబరు 2007 (19:39 IST)
గుండె ధమనులు కొన్ని చోట్ల కుంచించుకుపోవడం, పూడిపోవడం తదితర కారణాల వల్ల మరణం సంభవించే ప్రమాదం ఉంది. వ్యాధిగ్రస్థ గుండె ధమనులను తిరిగి స్వస్థపరచడం, వాటిలోని గారను, పూడికలను కరిగించి తీసివేయడం, వాటిలో మళ్లీ రక్తం పూర్తి స్థాయిలో గాని, కనీస స్థాయిలో గాని ప్రసరించేటట్లు చేయడం ఔషద చికిత్సలలో సాధ్యం కాదని యాంజియోపాస్ట్, స్టెంట్, బైపాస్ సర్జరీలకు ప్రత్యామ్నాయాలు లేవని గట్టిగా చెబుతారు.

కాని అత్యధిక ఖర్చుతో కూడిన ఈ చికిత్సలు ఎక్కువ మందికి అందుబాటులో ఉండడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నది. గుండె ధమనుల వ్యాధులను శస్త్రచికిత్స అవసరం లేకుండా శాశ్వతంగా నయం చేయగల అనేక చికిత్సలు మూలికావైద్యంతో పాటు అల్లోపతి విధానంలో కూడా అందుబాటులో ఉన్నాయి.

ఉదాహరణకు మూలికావైద్యం విషయానికి వస్తే... ఆహారంలో పది శాతానికి మించిన కొవ్వు, అతిగా శుభ్రం చెయ్యని తృణధాన్యాలు, చిరుధాన్యాలు, కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు, పండ్ల రసాలు, క్రమం తప్పని వ్యాయామం, ధాన్యం వంటి వాటితో పాటు గింకో బైలోబా, బ్రహ్మి వంటి మూలికలతో గుండె ధమనుల వ్యాధి నుంచి స్వస్థత పొందవచ్చు.

వెబ్దునియా పై చదవండి