సంపూర్ణ ఆరోగ్యానికి హోమియోపతి

ND
హోమియోపతి విధానం అందరికీ అర్థమవ్వాలంటే దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సారూప్యతా సిద్ధాంతం మీద ఆధారపడి హోమియోపతి వైద్యం చేస్తారు. అంటే వ్యాధి లక్షణాలతో సరిపోలిన నివారణోపాయాలతో రోగాన్ని నయం చేయడం. హోమియోపతి మందులను అనేక రకాల మూలాల నుంచి తయారు చేస్తారు.

ముఖ్యంగా చెట్లు, జంతువులు, వ్యాధిగ్రస్త భాగాలు, ఆరోగ్యకర భాగాలు, లోహాల నుంచి సేకరించే పదార్థాలతో హోమియోపతి మందులు తయారవుతాయి. ఈ మందులను మనవజాతిపై మాత్రమే ఫలితాలు చూపే విధంగా తయారు చేస్తారు. వీటిని తీసుకోవడం వలన ఎటువంటి హాని జరగదు. సరైన మోతాదులో, సూచించిన విధంగా తీసుకోవడం వలన 100 శాతం దష్ఫ్రభావాలను అరికట్టవచ్చు.

ఇతర విధానాలకు హోమియోపతి వైద్యానికి సారూప్యత అసలుండదు. ఉదాహరణకు అలోపతి అంటే ఇంగ్లీషు చికిత్సావిధానం అన్నమాట. ఉదా: నొప్పికి పెయిన్ కిల్లర్స్ అలోపతి చికిత్సా విధానంలో ఏ ఇద్దరిలో ఒకే రకమైన సమస్యకు ఒకే రకమైన మందును వైద్యులు సూచిస్తారు. అదే హోమియోపతి చికిత్సా విధానంలో ఏ ఇద్దరిలో ఒకే రకమైన సమస్య ఉన్నప్పటికీ మందు, మాత్రలు ఇవ్వడంలో మార్పు ఖచ్చితంగా ఉంటుంది.

హోమియోపతిలో చికిత్సావిధానంలో ఉదాహరణకు ఓ ఆవేశపరుడైన వ్యక్తికి తలనొప్పి ఉండి, మృధు స్వభావి అయిన వ్యక్తి కూడా ఇదే సమస్య ఉంటే వారిద్దరికీ ఇచ్చే మందు మారిపోతుంది. ఈ ఇద్దరికీ హోమియోపతిలో ఒకే మందు ఇస్తే ఫలితం కనిపించదు.

హోమియోపతిలో మనిషి మానసిక ప్రవర్తనను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఇది పూర్తిగా వ్యక్తి స్వభావాన్నిబట్టి ఇచ్చే వైద్య విధానం ఈ హోమియోపతి. మానసిక, శారీరక లక్షణాలు ఆధారంగా చేసుకొని వైద్యం చేస్తారు.

ప్రస్తుతం అసలైన శాస్త్రీయ హోమియోపతి వైద్యం వ్యాపార రంగు పులుముకుంటోంది. తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకుగాను హోమియోపతిలోనున్న ప్రాథమిక సిద్ధాంతాలను కూడా పాటించకుండా ఇప్పుడు వైద్యం జరుగుతున్న దాఖలాలున్నాయి.

అతి కొద్ది మంది వైద్యులు మాత్రమే అసలైన శాస్త్రీయ హోమియోపతి వైద్య విధానాన్ని పాటిస్తున్నారు. హోమియోపతి విధానం చాలా ఉత్తమమైనది. దీని ద్వారా గుర్తు తెలియని రోగాలను కూడా చికిత్స ద్వారా నయం చేయవచ్చు. అయితే మనకు వైద్యం చేస్తున్నవారి గురించి ఆలోచించాలి.

కొద్ది మంది వైద్యులు మాత్రమే హోమియోపతి వైద్యం ద్వారా డబ్బు కాకుండా వంద శాతం ఫలితాలను రాబడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో (స్వైన్‌ఫ్లూ కొత్త వ్యాధి) ప్రజలు హోమియోపతి వైద్యం గురించి కనీస అవగాహన కలిగివుంటే మంచిది.

దీని ద్వారా ఎటువంటి దుష్ఫ్రభావాలు లేకుండా అందరూ ఆరోగ్యకర జీవనం సాగించవచ్చు. హోమియోపతి వైద్యాన్ని సాధారణ పౌరులు కూడా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు తాళం. మనం సరైన తాళం చెవితో తెరిస్తే తాళం తెరుచుకుంటుంది.

ఇదే సూత్రం హోమియోపతి వైద్యానికి కూడా వర్తిస్తుంది. బాధిత వ్యక్తి హోమియో వైద్యుడి వద్దకు వచ్చినప్పుడు రోగ లక్షణాలు, నివారణకు తయారు చేసే మందు సరిపోతే వ్యాధి నయమవుతుంది. ఇక్కడ సేకరించే మందు మూలాలే ప్రధానం.

హోమియోపతిలో ఒక్క తలనొప్పికే వేలరకాల మందులు ఉన్నాయంటున్నారు వైద్యనిపుణులు. రోగి శారీరక, మానసిక స్థితిని బట్టి వైద్యుడు మందును సూచించాలి. హోమియోపతి విధానంలో వైద్యం ఇలానే చేస్తారు. తరువాత భాగంలో మనం హోమియోపతిలో ఉపయోగకర మందులు గురించి తెలుసుకుందాం...
- డాక్టర్ మాధురీ కృష్ణ

వెబ్దునియా పై చదవండి