ఎక్కడ విప్పమంటారూ..?! ప్లేయర్ల ముందా..?!! మైదానంలోనా..?!!!

శుక్రవారం, 1 ఏప్రియల్ 2011 (17:06 IST)
PR
టీమిండియా ప్రపంచకప్‌ను గెలుచుకుంటే వారికి ప్రభుత్వం ఇచ్చే నజరానాలు చాలానే ఉంటాయి. అయితే సగటు మహిళగా తాను అంతగా ఇచ్చుకోలేకపోయినప్పటికీ వారికోసం తన అందాలన్నిటినీ చూపిస్తానంటోంది ఇండియన్ హాట్ మోడల్ పూనమ్ పాండే.

పాకిస్తాన్‌పై భారత్ సెమీఫైనల్ ఆడుతున్నప్పుడే ఈ విషయాన్ని చెప్పింది. అయితే మరోసారి గుర్తు చేస్తోంది. కాకపోతే అప్పుడు దుస్తుల్ని విప్పేసి మైదానంలో నగ్నంగా నిలబడతానని చెప్పిన ఈ భామ తాజాగా పలు ఆప్షన్స్‌ను బయటపెట్టింది.

టీమిండియా కప్ గెలుచుకున్నాక దుస్తులు విప్పేసి నగ్నంగా నిలబడతానన్న తన మాటకు పూర్తిగా కట్టుబడి ఉన్నానని చెపుతోందీ భామ. అధికారులు ఒప్పుకుంటే మైదానంలో నగ్న ప్రదర్శనకు రేడీయేనంటోంది. ఒకవేళ అది కుదరకపోతే ప్లేయర్ల డ్రెస్సింగ్ రూమ్‌లో తన వలువలు వలిచేసి నగ్నంగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నానంటోంది.

జట్టు విజయంకోసం మైదానంలో నగ్నంగా నిలబడతానని చేసిన వ్యాఖ్యల పట్ల చాలామంది పొగడ్తల జల్లు కురిపిస్తున్నారని కూడా చెపుతోంది. అంతెందుకు... తన తల్లిదండ్రులే తను చేసిన ప్రకటనపై గర్వపడుతున్నారనీ, టీమిండియా గెలుపుకోసం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారని అంటోంది.

నగ్నంగా అందాలను ప్రదర్శించడం తప్పని కొందరంటున్నారనీ, అయితే చట్టబద్ధంగానే నగ్న ప్రదర్శన చేస్తానని చెపుతోందీ బ్యూటీ. ఇందుకోసం బీసీసీఐ వద్ద అనుమతి తీసుకునేందుకు వెళుతున్నట్లు చెప్పింది. మరి బీసీసీఐ ఏం చేస్తుందో...? అనుమతిస్తుందా...?

వెబ్దునియా పై చదవండి