దేశం గర్వించదగ్గ మహిళా ఐపీఎస్ అధికారిణి

FileFILE
దేశంలో మొట్టమొదటి తొలి మహిళా ఐపీఎస్ అధికారిణిగా కిరణ్ బేడీ చరిత్ర పుటలకెక్కారు. 1972లో భారత పోలీసు శాఖలో చేరిన ఆమె అమృతసర్‌లో ప్రకాష్, ప్రేమ్ పెషావారియా దంపతులకు జన్మించిన నలుగురు కుమార్తెల్లో రెండో సంతానం. పోలీసు శాఖలో ఆదర్శ మహిళా అధికారిణిగా ప్రశంలు అందుకున్న బేడీ.. అత్యంత ప్రతిష్టాత్మంగా భావించే రామన్ మెగాసెస్ అవార్డును సొంతం చేసుకున్నారు.

దీనిని ఆసియన్ నోబెల్ బహుమతిగా కూడా పరిగణిస్తారు. తన విధులకు ఏమాత్రం భంగం కలుగకుండా రెండు స్వచ్ఛంధ సంస్థలను ఆమె విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వీటిలో నవజ్యోతి అనే సంస్థలను 1988లోను, ఇండియన్ విజన్ ఫౌండేషన్‌ను 1994లోను స్థాపించారు. విద్యాబుద్ధులకు నోచుకోని వేలాది మంది చిన్నారులకు ఈ సంస్థలు ప్రాథమిక విద్యను అందిస్తున్నాయి.

అలాగే మహిళల్లో అక్షరాస్యతా శాతం పెంపుతో పాటు, మహిళలకు చేతి వృత్తుల్లో శిక్షణ ఇస్తూ మహిళాభ్యుదయానికి పాటుపడుతున్నారు. కిరణ్‌బేడీ సేవలను గుర్తించిన ఐక్యరాజ్య సమితి 'సెర్జ్ సోటిరాఫ్ మెమోరియల్ అవార్డు'తో తాజాగా సత్కరించింది. విద్యార్థి దశలో ఆసియన్ టెన్నీస్ ఛాంపియన్‌‌గా ఎన్నికైంది. మాదకద్రవ్యాల నిర్మూలన, డొమెస్టిక్ వైలెన్స్‌పై డాక్టరేట్‌ చేసిన బేడీ.. 2002లో ది వీక్ పత్రిక నిర్వహించిన సర్వేలో దేశంలో అత్యంత ధైర్యవంతులైన మహిళల్లో కిరణ్‌బేడీకి ఐదో స్థానం దక్కింది.

వెబ్దునియా పై చదవండి