కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

సెల్వి

శనివారం, 18 మే 2024 (14:25 IST)
కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించేందుకు ఆ యువతి ఆస్పత్రిలో చేరింది. అయితే ఆ యువతి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. మరణించి ఒక రోజు గడిచినా యువతిని వెంటిలేటర్‌పై ఉంచామంటూ తల్లిదండ్రులను మభ్యపెట్టి శుక్రవారం మరణించినట్లు వైద్యులు ప్రకటించడంతో ఆ యువతి కుటుంబ సభ్యులు ఆవేశంతో ఆందోళనకు దిగారు. 
 
విజయవాడ గాంధీనగర్‌కు చెందిన పేర్ల లక్ష్మీ వెంకట రితిక (18) నందిగామ మిక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ తొలి సంవత్సరం చదువుతోంది. రితికకు చిన్నప్పటి నుంచి కాళ్లు వంకరగా వుండటంతో 2019లో విజయవాడ నగరంలోని ఓ ఆస్పత్రిలో సర్జరీ చేసి ప్లేట్లు అమర్చారు. 
 
ఈ క్రమంలో కాలిలోని ప్లేట్లను తీసేయాలని వైద్యులు సూచించడంతో సర్జరీ కోసం బుధవారం యువతిని ఆస్పత్రిలో చేర్చారు తల్లిదండ్రులు. అయితే మత్తు వికటించిందని వెంటిలేటర్‌పై వుంచామని చెప్పి.. చివరికి రితిక మరణించిందని వైద్యులు చెప్పడంతో ఆమె కుటుంబీకులు బాధలోనే ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు