నవరాత్రులను పురస్కరించుకుని చెన్నైలోని అకార్డ్ మెట్రోపాలిటన్ నక్షత్ర హోటల్ గుజరాతీ ఫుడ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తోంది. ఈనెల 18వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పది రోజుల పాటు సాగే ఈ ఆహార ఉత్సవంలో గుజరాతీ సంస్కృతీ సంప్రదాయాల్లో ప్రత్యేకంగా పేరున్న వంటకాలను తయారు చేసి ప్రదర్శనకు ఉంచుతారు.
ఈ ఫెస్టివల్ ప్రతి రోజు రాత్రి ఏడు గంటల నుంచి 11 గంటల వరకు సాగుతుంది. ఈ ఫెస్టివల్లో ఛుండో అండ్ తెప్లెస్, ఖమాన్ థోక్లా, ఉందియా, కిచ్చడి, కడి, సేవ్ తమటార్ ను షాక్, బటాట్ ను షేక్ తదితర వంటకాలు చోటు చేసుకోనున్నాయి. అలాగే.. కేసర్ రబ్రీ, ఘీవర్ రబ్రీ వంటి రైస్ వెరైటీలు కూడా చోటు చేసుకోనున్నట్టు అకార్డ్ మెట్రోపాలిటన్ నక్షత్ర హోటల్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.