కొబ్బరి తురుము రైస్

గురువారం, 8 జనవరి 2009 (18:00 IST)
FileFILE
కావలసిన పదార్ధాలు :
బాస్మతి బియ్యం .. రెండు కప్పులు
కొబ్బరి.. ఓ తురుము (రెండు చిప్పలు)
నెయ్యి .. అర కప్పు
జీడిపప్పులు.. అర కప్పు
లవంగాలు .. నాలుగు
ఉప్పు.. సరిపడా
జీరా.. ఓ స్పూను
పాలు... సరిపడా

తయారీ విధానం :
ముందుగా బియ్యాన్ని నీటిలో కడిగి, అరగంట పాటు నానబెట్టి బాగా కడగాలి. మందపాటి పాత్రలో నేయి వేసి, అందులో జీడిపప్పు వేయించాలి. తరువాత జీర, మసాలా దినుసులు, కొబ్బరి, బియ్యం, వేడిపాలు వేసి, తగినంత ఉప్పువేసి మూతపెట్టి ఉడికించాలి. బాగా ఉడికిన తరువాత మూత తీయకుండా వేడిమీదనే ఐదు నిమిషాల పాటు ఉంచాలి. తరువాత కిందకు దించి.. వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి