కావలసిన పదార్థాలు : ఫైనాపిల్ ముక్కలు... ఒక కప్పు ఉల్లికాడల ముక్కలు.... ఒక కప్పు పచ్చి బఠాణీలు... అర కప్పు కాబూలీ శనగలు... అర కప్పు సోయాబీన్ సాస్... ఒకటిన్నర టీస్పూన్ పంచదార... అర టీస్పూన్ మిరియాలపొడి... సరిపడా వెల్లుల్లి పేస్టు... ఒక టీస్పూన్ ఉడికించిన రైస్... మూడు కప్పులు క్యాప్సికమ్ ముక్కలు... అర కప్పు మొక్కజొన్న గింజలు.... పావు కప్పు టమోటో ముక్కలు... పావు కప్పు టమోటో సాస్... ఒక టీస్పూన్ ఉప్పు... తగినంత అల్లం పేస్టు... ఒక టీస్పూన్ నూనె.... అర కప్పు
తయారీ విధానం : ముందుగా బఠాణీ, మొక్కజొన్న, శనగలు ఉడికించి ఉంచాలి. పాన్‌లో నూనె వేసి, వేడి చేయాలి. అందులో అల్లం, వెల్లుల్లి పేస్టు వేసి కలుపుతూ వేపాలి. ఆ పేస్టుకి ఉల్లికాడల ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి తిప్పుతూ కాసేపు వేగిన తరువాత, పచ్చిబఠాణీలను కూడా కలిపి వేయించాలి.
పైన వేగుతున్న పదార్థానికి మొక్కజొన్న గింజలు, శనగలను కూడా కలపాలి. చివరగా ఫైనాపిల్ ముక్కలు, టమోటో ముక్కలను కూడా వేసి ఒక నిమిషంపాటు వేయించాలి. ఉడికించిన అన్నంలో ఉప్పు, పంచదార, సోయా, టమోటో సాస్‌లను వేసి బాగా కలిపాలి. దీనికి వేయించి ఉంచిన పదార్థాలను కలిపి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే... ఫైనాపిల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్లే...!