రుచికరమైన ఉగాది పచ్చడి

సోమవారం, 7 ఏప్రియల్ 2008 (10:33 IST)
FileFILE
ఉగాది పర్వదినాన అందరూ తప్పనిసరిగా చేసుకుని ఆరగించాల్సిన వంటకం ఉగాది పచ్చడి
కావలసిన పదార్థాలు :
లేతగా ఉన్న మామిడి కాయ - ఒకటి, చింతపండు గుజ్జు - రెండు చెంచాలు, లేత వేప పూవు - రెండు రెబ్బలు, బెల్లం - చిన్న ముక్క, పంచదార - స్పూన్, జామపండు ముక్కలు - అరకప్పు, అరటిపండు ముక్కలు - పావు కప్పు, ఉప్పు - చిటికెడు, కారం - చిటికెడు.

తయారు చేయు విధానం :
ముందుగా చింతపండును కడిగి నీళ్లు పోసి నానబెట్టండి. మామిడి కాయ తొక్క తీసి ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోండి. వేప రెమ్మలను తీసుకుని పువ్వులను విడిగా వలిచి పెట్టుకోండి. బెల్లాన్ని పొడిగా చేసి పెట్టుకోండి. చింతపండు గుజ్జును తీసి అందులో కాసిని నీళ్లు పోయండి.

ఇందులో మామిడి ముక్కలు, జామపండు ముక్కలు, లేత వేప పూవు, అరటి పండు ముక్కలు, పొడిచేసి పెట్టుకున్న బెల్లం, పంచదార, కాస్త కారం, ఉప్పులను వేసి కలపాలి. తర్వాత దీనిని నైవేజ్యం పెట్టి సర్వ్ చేయండి మరి. ఆలస్యం ఎందుకు ?

వెబ్దునియా పై చదవండి