పెరుగులో క్యాల్షియం పుష్కలంగా ఉన్నాయి. ఈ వేసవిలో మజ్జిగ, పెరుగన్నం వంటివి తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అలాంటి పెరుగుతో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చితో తయారు చేసుకుని పండ్లు కూడా చేర్చుకుంటే హెల్తీ కర్డ్ రైస్ రెడీ అయినట్లే.. ఎలా చేయాలో చూద్దాం..
ఆవాలు, జీలకర్ర : పోపుకు తగినంత
పచ్చిమిర్చి తరుగు : రెండు టీ స్పూన్లు
బాదం తరుగు : పావు కప్పు
తయారీ విధానం :
ముందుగా ఉడికించిన రైస్‌కు చిటికెడు ఉప్పు.. పంచదార మిక్స్ చేసి గరిటతో బాగా మెదపాలి. అందులో తాజా పెరుగు, పాలు, పెరుగు, ద్రాక్ష, చెర్రీ వేసి బాగా మిక్స్ చేయాలి. మరో పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి వేసి రెండు నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. స్టౌ ఆఫ్ చేసి ముందుగా ఉప్పు, పంచదార మిక్స్ చేసిన అన్నంను పోపులో వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకొన్న కొత్తిమీర తరుగు, బాదం తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది. కావాలంటే క్యారెట్ తురుము కూడా చేర్చుకోవచ్చు. అంతే రుచికరమైన హెల్తీ కర్డ్ రైస్ రెడీ.