పండ్లకు రారాజు.. మామిడి పండు. ఊరించే రంగుతో.. కమ్మనైన రుచితో.. నోరంతా తీపి చేసే పండు ఇది. ఎండాకాలంలో మీ నోరూరిస్తుంది. ఈ మామిడి పండుతో చక్కటి వంటలు చేసుకొని.. కమ్మగా లాగించేయొచ్చు. పచ్చి మామిడికాయల పుల్లదనం.. మామిడి పండ్ల తియ్యదనాన్ని ఇలా హాయిగా ఆస్వాదించేయొచ్చు. మామిడి పండుతో అనేక రకాలే వంటకాలు, జ్యూస్‌లు చేసుకోవచ్చు. ఇలాంటి వాటిలో మ్యాంగో స్మూతీని ఎలా తయారు చేస్తారో పరిశీలిద్ధాం.
తయారీ విధానం..
మామిడి పండును మెత్తటి గుజ్జులా చేసుకోవాలి. ఇందులో చక్కెర, పెరుగు వేసి బాగా కలపాలి. ఈ ప్యూరీలో కొబ్బరి పాలు కూడా పోసి బాగా కలియ తిప్పాలి. ఇప్పుడు ఈ స్మూతీని గ్లాసుల్లోకి పోసుకొని ఫ్రిజ్‌లో 20 నిమిషాల పాటు ఉంచాలి. పైన చిన్నచిన్న మామిడి ముక్కలతో గార్నిష్ చేసి చల్లగా సర్వే చేయండి.